Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థ్రిల్లర్ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్టులుక్

  • దర్శకుడిగా గుహన్ 
  • థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • త్వరలోనే పూర్తి వివరాలు      
కల్యాణ్ రామ్ పుట్టిన రోజు .. ఈ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రానికి సంబంధించిన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకుడిగా కల్యాణ్ రామ్ తో ఒక థ్రిల్లర్ మూవీ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. కల్యాణ్ రామ్ 16వ మూవీగానే ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

 కల్యాణ్ రామ్ ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు .. మరింత హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నాడు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందట. అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.             
kalyan ram

More Telugu News